తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక మహోత్సవాలు... విజయవంతం చేయాలన్న చిరంజీవి

  • రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ పేరిట కార్యక్రమాలు
  • వివిధ కళారూపాలు ప్రదర్శించనున్న కళాకారులు
  • ఈ నెల 26, 27 తేదీల్లో రాజమండ్రిలో ప్రదర్శనలు
  • వరంగల్, హైదరాబాదులోనూ ప్రదర్శనలు
  • చిరంజీవి వీడియో సందేశం
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే దేశం మన భారతదేశం అని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆ మహోన్నత సంస్కృతిని ప్రతిబింబించేలా భారత కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను జరుపుతోందని అన్నారు.  

మనదేశ ఘన వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచే ఎందరో కళాకారులు వివిధ కళారూపాలను ఈ నెల 26, 27 తేదీల్లో రాజమండ్రిలో ప్రదర్శించనున్నారని తెలిపారు. అలాగే, ఈ నెల 29, 30 తేదీల్లో వరంగల్ లో, హైదరాబాదులో ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉంటాయని చిరంజీవి వివరించారు. 

ఈ ఉత్సవాలను అందరం తిలకించి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మన దేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో మనందరం భాగస్వాములం అవుదామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం వెలువరించారు.


More Telugu News