బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిపై పరువు నష్టం దావా
- తేజీందర్ బగ్గాపై కేసులున్నాయని ట్వీటిన స్వామి
- కోర్టును ఆశ్రయించిన తేజీందర్ బగ్గా
- స్వామికి సమన్లు జారీ చేసిన కోర్టు
సీనియర్ రాజకీయవేత్త, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చిక్కుల్లో పడ్డారు. సొంత పార్టీ నేత ఆయనపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు సుబ్రహ్మణ్య స్వామికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఢిల్లీకి చెందిన యువ నేత తేజీందర్ బగ్గా గతేడాది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిత్వంపై సుబ్రహ్మణ్యస్వామి ఓ ట్వీట్ సంధించారు. తేజీందర్ బగ్గా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, ఆయనను పార్టీలో ఎలా చేర్చుకుంటున్నారని కొందరు జర్నలిస్టులు స్వామిని ప్రశ్నించారట.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్వామి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను చూసిన బగ్గా.. స్వామిపై రౌజ్ ఎవెన్యూ కోర్టులో బగ్గా పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. స్వామికి నోటీసులు జారీ చేసింది.