ర‌ఘురామ‌కృష్ణరాజుపై ప‌రువు న‌ష్టం దావా.. ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం!

  • ఏపీలో దొరికే మ‌ద్యం హానికరమన్న ర‌ఘురామ‌
  • చెన్నైలోని ఓ ల్యాబ్‌లో ప‌రీక్ష‌లు చేయించిన వైనం
  • తాజాగా ప్ర‌భుత్వానికి అందిన నివేదిక‌
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై ప‌రువు న‌ష్టం దావా వేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జత్ భార్గ‌వ మంగ‌ళ‌వారం నాడు ఓ ప్ర‌కట‌న విడుద‌ల చేశారు. ప్ర‌భుత్వంపై ర‌ఘురామ‌కృష్ణరాజు ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఏపీలో దొరుకుతున్న మ‌ద్యంలో హానిక‌ర ర‌సాయ‌నాలున్నాయని ఆరోపించిన ర‌ఘురామ‌రాజు ఆ మ‌ద్యం శాంపిళ్ల‌ను చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబ్‌లో ప‌రీక్ష‌లు జ‌రిపించారు. ఆ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నివేదిక తాజాగా ప్ర‌భుత్వానికి అందింది. ఈ నివేదిక ప్ర‌కారం ఏపీలో దొరుకుతున్న మ‌ద్యంలో ఎలాంటి హానిక‌ర ర‌సాయ‌నాలున్నాయని తేలలేద‌ని ర‌జ‌త్ భార్గ‌వ తెలిపారు. ప్ర‌భుత్వంపై ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న ర‌ఘురామరాజుపై ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు.


More Telugu News