అవి లోకేశ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివరణ
- అసెంబ్లీలో ఘాటు వ్యాఖ్యలు చేసిన నారాయణస్వామి
- లోకేశ్ ను అన్నారంటూ టీడీపీ వర్గాల ఆగ్రహం
- స్పందించిన నారాయణ స్వామి\
నిన్న ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. నారా లోకేశ్ ను ఉద్దేశించి నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నారాయణస్వామి వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు నారా లోకేశ్ ను ఉద్దేశించి చేసినవి కావని స్పష్టం చేశారు.
క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో జగన్ సర్కారుకు సమస్యలు వస్తాయని ఓ వ్యక్తి తనకు ఫోన్ చేశాడని, ఆ వ్యక్తి గురించే సభలో మాట్లాడానని పేర్కొన్నారు. అయినప్పటికీ అలాంటి వ్యాఖ్యలను తాను అసెంబ్లీలో చేయడం సరికాదని భావిస్తున్నానని నారాయణస్వామి తెలిపారు. అవతలి వ్యక్తి మాటల వల్ల తాను బాధపడ్డాను కాబట్టే సభలో అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. పేదలు, బడుగు బలహీనులకు న్యాయం చేస్తున్న సర్కారును కూలగొడతామంటే కోపం రాదా? అని ప్రశ్నించారు.