వారికో నీతి, ఇతరులకు మరో నీతి కుదరదు.. ధాన్యం కొనుగోళ్లపై కవిత
- పంజాబ్‌లో కొన్నట్లే తెలంగాణలో కొనాలి
- ఒక దేశం ఒకే సేకరణ విధానమే మా డిమాండ్
- ధాన్యం కొనుగోళ్లపై కల్వకుంట్ల కవిత వాదన
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. యాసంగిలో తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని కేసీఆర్ సర్కారు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏకంగా కేంద్రంపై టీఆర్ఎస్ సర్కారు యుద్ధాన్నే ప్రకటించింది.
ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆమె ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని ఆమె తెలిపారు. కేంద్రం పంజాబ్‌లో వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లే తెలంగాణలోనూ మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఒక దేశం ఒకే సేకరణ విధానాన్నే తాము డిమాండ్ చేస్తున్నామని ఆమె తెలిపారు.