రసాయనిక ఆయుధాలు ప్రయోగించే అవకాశాలను పుతిన్ పరిశీలిస్తున్నారు: కీలక వ్యాఖ్యలు చేసిన బైడెన్
- 27 రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు
- ఇప్పటికీ లొంగని ఉక్రెయిన్
- రష్యన్ బలగాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న వైనం
గత 27 రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తుండడం తెలిసిందే. గత కొన్నిరోజులుగా రష్యా దాడుల్లో తీవ్రత పెరిగింది. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలను రష్యా ఉపయోగిస్తోంది. ఈ క్రమంలో వ్యూహాత్మక అణ్వస్త్ర దాడులు, రసాయనిక, జీవాయుధ దాడుల ప్రస్తావన కూడా వినిపిస్తోంది. తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రష్యా ఆశించిన మేర ముందుకు వెళ్లలేకపోతోందని తెలిపారు. అందుకే ఉక్రెయిన్ పై రసాయనిక, జీవాయుధాలు ప్రయోగించే అవకాశాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరిశీలిస్తున్నారని బైడెన్ వెల్లడించారు. దీనికి సంబంధించి తమవద్ద పక్కా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికాపై రష్యా సైబర్ దాడులకు దిగే ప్రమాదం ఉందని, అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.