పద్మావతి నిలయంలో కలెక్టరేట్ కుదరదు: ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
- పద్మావతి నిలయంలో మార్పులు వద్దు
- ప్రభుత్వ ప్రొసీడింగ్స్‌పై యథాతథ స్థితి
- విచారణ ఈ నెల 29కి వాయిదా వేసిన హైకోర్టు
ఏపీలో కొత్త జిల్లాల విషయంలో జగన్ సర్కారు దూకుడు ప్రదర్శిస్తుండగా.. తిరుపతిలోని పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌గా మార్చే విషయంపై ఏపీ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పద్మావతి నిలయంలో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదంటూ ఏపీ సర్కారును ఆదేశించింది. ఈ మేరకు పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌గా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. పద్మావతి నిలయంలో కలెక్టరేట్ కుదరదంటూ ఆదేశాలు జారీ చేసినట్టయింది.
పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌గా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై యథాతథ స్థితిని పాటించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.