రాజమౌళి ఫాలో అయ్యేది ఆయనొక్కడినే!

  • ఫేస్ బుక్ లో కీరవాణిని మాత్రమే అనుసరిస్తున్న జక్కన్న
  • ట్విట్టర్ లో 17 మందిని ఫాలోయింగ్
  • తన తండ్రి, బాబాయ్ నే ఫాలో అవుతున్న చరణ్
సెలబ్రిటీలకు మామూలుగానే ఫాలోవర్లు ఎక్కువగా ఉంటారు. ఎదుటివారినీ వారు ఫాలో అవుతుంటారు. అందులో కొందరు అతి తక్కువ మందినే అనుసరిస్తారు. అదే జాబితాలోకి వస్తారు డైరెక్టర్ రాజమౌళి. ఆయనైతే ఒకే ఒక్కరిని ఫేస్ బుక్ లో ఫాలో అవుతారని తెలుసా? 

తన సినిమాలు, కథలు, వాటిలో హీరోలు, లొకేషన్స్ గురించే ఎక్కువగా ఆలోచించే ఆయన సోషల్ మీడియాకు కొంచెం దూరంగానే ఉంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలున్నా.. పరిమితికి మించి ఆయన వాడరు. 

ట్విట్టర్ లో ఆయనకు 57 లక్షల మంది ఫాలోవర్లుండగా.. 17 మందిని ఆయన ఫాలో అవుతున్నారు. ఫేస్ బుక్ లో 75 లక్షల మంది రాజమౌళిని ఫాలో అవుతుంటే.. ఆయన మాత్రం ఒకే ఒక్కరిని అనుసరిస్తున్నారు. ఆయన మరెవరో కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఇక ఇన్ స్టా గ్రామ్ లో ఆయనకు 11 లక్షల మంది ఫాలోవర్లున్నారు. 

కాగా, రామ్ చరణ్ కు ట్విట్టర్ లో 20 లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఆయన మాత్రం తన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్ ను మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇన్ స్టాలో ఆయనకు 52 లక్షల మంది, ఫేస్ బుక్ లో 1.2 కోట్ల మంది ఫాలోవర్లున్నారు.


More Telugu News