బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళిని
- ఇటీవలే పెరారివాలన్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో సబ్ పిటిషన్ వేసిన నళిని
- తనకు బెయిల్ పొందే అర్హత ఉందని పిటిషన్ లో పేర్కొన్న వైనం
మూడు దశాబ్దాలకు పైగా జైలు జీవితం గడిపిన కారణంగా పెరారివాలన్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన సబ్ పిటిషన్ లో నళిని పేర్కొన్నారు. తాను కూడా మూడు దశాబ్దాలకు పైగా జైలు జీవితాన్ని గడిపానని, తనకు కూడా బెయిల్ పొందే అర్హత ఉందని చెప్పింది.