టీడీపీ నేతలు అసెంబ్లీలోకి ఏయే ఆయుధాలు తీసుకువచ్చారో చెక్ చేయాల్సిన అవసరం ఉంది: అంబటి
- నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు
- టీడీపీ సభ్యులు విజిల్స్ వేశారు
- చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకే ఇలా చేస్తున్నారన్న అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈరోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ టీడీపీ నేతలపై పలు ఆరోపణలు చేశారు. సభ సంప్రదాయాలకు భిన్నంగా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. విజిల్స్, కేకలు వేయడం సరికాదని అన్నారు. వారి తీరు చూస్తుంటే వారు సభలోకి ఏయే ఆయుధాలు తీసుకువచ్చారో చెక్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్పీకర్ చైర్ వైపుకు వేలు చూపిస్తూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకే శాసనసభలోకి ఆ పార్టీ సభ్యులు విజిల్స్ తీసుకువచ్చారని అన్నారు. కాగా, సభలోకి వైసీపీ నేతలే విజిల్స్ తీసుకొచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సభలో నుంచి ఆరుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.