సౌరవ్యవస్థకు వెలుపల 5,000 కొత్త ప్రపంచాలు

  • నాసా తాజా పరిశోధన వెల్లడి
  • కొన్ని భూమి కంటే పెద్దవి
  • 65 కొత్త గ్రహాల గుర్తింపు
ఆకాశం వైపు చూసినప్పుడల్లా.. ఈ విశ్వంలో భూమి మాదిరి ప్రపంచం మరేదైనా ఉందా? అన్న ప్రశ్న రావడం సహజం. శాస్త్రవేత్తలకు సైతం ఎప్పటి నుంచో ఇది ముఖ్య పరిశోధనా అంశం అయింది. ఈ క్రమంలో నాసా తాజా పరిశోధనను గమనిస్తే.. సౌరవ్యవస్థకు వెలుపల భూమి మాదిరి ప్రపంచాలు మరెన్నో ఉన్నాయని తెలుస్తోంది.

65 కొత్త గ్రహాలను గుర్తించిన నాసా.. లోతైన అంతరిక్షంలో వెలుగులోకి రావాల్సిన 5,000కు పైగా ప్రపంచాలు ఉన్నాయని తాజాగా ప్రకటించింది.  నాసా గుర్తించిన 65 గ్రహాల్లో నీరు, సూక్ష్మ జీవులు, గ్యాస్ లు, ప్రాణానికి అనుకూలించే పరిస్థితులున్నట్టు తెలిపింది. కొన్ని సూపర్ ఎర్త్ లు కూడా ఉన్నాయని.. భూమి కంటే అవి పెద్దవిగా పేర్కొంది. ప్రతి ఒక్కటీ కొత్త ప్రపంచమేనని, కొత్త గ్రహమేనని తెలిపింది.


More Telugu News