ఆరోగ్యానికి హానికరమని తెలిసినా అన్నింటికీ అలవాటుపడ్డాం.. హీరోయిన్ మెహ్రీన్ ఆవేదనా భరిత వ్యాఖ్యలు
- సినిమా కోసం శరీరాలను అనుకూలంగా మార్చుకుంటాం
- ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటాం
- ఎండనకా, వాననకా కష్టపడుతుంటాం
- ఆర్టిస్టుల జీవితాలపై మెహ్రీన్ భావోద్వేగభరిత పోస్టు
సినీ పరిశ్రమ, ఆర్టిస్టుల జీవితాలపై హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ఆవేదనా భరిత వ్యాఖ్యలు చేసింది. ఆర్టిస్టుల జీవితాలే చాలా చిత్రంగా ఉంటాయని ఆమె వ్యాఖ్యానించింది. జీవితంలో ఎలాంటి గ్యారంటీలేని బతుకులని తెలిపింది. అలాంటి అస్థిర జీవితాలను తాము ఇష్టపూర్వకంగానే ఎంచుకుంటామని చెప్పింది. సినిమా కోసం తమ శరీరాలను అనుకూలంగా మలచుకుంటామని తెలిపింది. ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తుంటామని, కొన్నికొన్ని సార్లు అధ:పాతాళానికీ వెళ్లిపోతుంటామని పేర్కొంది.
ఒక్కోసారి రాత్రికి రాత్రే ఘనమైన విజయాలు సాధిస్తుంటామని, మరికొన్ని సార్లు వైఫల్యాలను చూస్తామని తెలిపింది. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా సినీ జీవితంలో భాగంగా తాము అన్నిటికీ అలవాటు పడ్డామని ఆవేదన వ్యక్తం చేసింది. ఆకలి, నిద్ర, బాధ అన్నింటికీ ఓర్చుకుని పనిచేస్తామంది.
ఎండనకా.. వాననక.. పగలు, రాత్రుళ్లన్న తేడా లేకుండా రోజులు, వారాలపాటు కష్టపడుతుంటామని తెలిపింది. ఇంటికి, కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంటూ.. మరింత ముందుకు పోవాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంటామని చెప్పింది. ఏది చేసినా.. ఎంత కష్టపడినా.. అంతిమంగా కళ కోసమేనని ఆమె తెలిపింది.