పెట్రోల్‌, డీజిల్, వంట‌గ్యాస్ ధ‌రల పెరుగుద‌ల‌పై రాజ్య‌స‌భ‌లో విప‌క్షాల ఆందోళ‌న‌

  • ధ‌ర‌లు త‌గ్గించాల‌ని ప్ల‌కార్డులు 
  • వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించిన వైనం
  • స‌భ నేటి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా  
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొన్ని నెల‌ల‌ పాటు పెర‌గ‌ని పెట్రోలు, డీజిల్‌ ధ‌ర‌లు నేడు ఒక్క‌సారిగా లీట‌రుకు 90 పైసలు, 87 పైసలు పెరిగిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల త‌ర్వాత పెట్రోలు, డీజిలు ధ‌ర‌లు పెరుగుతాయ‌ని అంద‌రూ ఊహించిన‌ట్లుగానే మ‌ళ్లీ పెరుగుద‌ల మొద‌లు కావ‌డంతో దీనిపై రాజ్య‌స‌భ‌లో విపక్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. 

అలాగే, ఎల్పీజీ సిలిండ‌ర్ల ధ‌ర‌లు కూడా త‌గ్గించాల‌ని ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఛైర్మ‌న్ వెంక‌య్య నాయుడు స‌భ‌ను తొలుత 12 గంట‌ల‌ వరకు వాయిదా వేయ‌గా, ఆ త‌ర్వాత స‌భ ప్రారంభ‌మైంది. అయిన‌ప్ప‌టికీ, ఆ స‌మ‌యంలోనూ వెల్‌లోకి  విప‌క్ష స‌భ్యులు దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించడంతో స‌భ నేటి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా ప‌డింది. 



More Telugu News