టీపీసీసీలో లుకలుకలు.. ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి.. జగ్గారెడ్డి తీరుపై ఆగ్రహం
- ఇటీవలే వీహెచ్, జగ్గారెడ్డి భేటీ
- జగ్గారెడ్డిపై పార్టీ తీవ్ర చర్యలు
- ఢిల్లీలో పలువురు నేతలను కలవనున్న రేవంత్ రెడ్డి
టీపీసీసీలో మరోసారి లుకలుకలు బయటపడడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇటీవల తమ పార్టీ అధిష్ఠాన సూచనలను ధిక్కరించి మరీ వీహెచ్, జగ్గారెడ్డి హైదరాబాద్‌లోని అశోక హోటల్‌లో సమావేశం కావడంతో ఇప్పటికే జగ్గారెడ్డిపై ఆ పార్టీ పలు చర్యలు తీసుకుంది. అయినప్పటికీ జగ్గారెడ్డి ఏ మాత్రం తగ్గట్లేదు.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాతి నుంచి ఆయనను లక్ష్యంగా చేసుకుని పలువురు సీనియర్ నేతలు వ్యాఖ్యలు చేస్తుండడంతో రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో పలువురు సీనియర్ నేతల తీరుపై ఆయన తమ పార్టీ అధిష్ఠానానికి వివరాలు తెలపనున్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి వ్యవహారాన్ని తమ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌తోనూ ఆయన భేటీ కానున్నారు.