34 ఏళ్లు గడిచిపోయినా సిద్ధూని వెంటాడుతున్న పాత కేసు
- 1988లో గుర్నామ్ సింగ్ పై సిద్ధూ, ఆయన స్నేహితుడి దాడి
- దాడిలో గుర్నామ్ సింగ్ మృతి
- రోడ్డు పక్కన గొడవ అని సిద్ధూని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన గుర్నామ్ సింగ్ కుటుంబం
వివరాల్లోకి వెళ్తే 1988 డిసెంబర్ లో పాటియాలాలో పార్కింగ్ విషయమై గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపీందర్ సింగ్ సాధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గుర్నామ్ సింగ్ ను కారు నుంచి బయటకు లాగిన సిద్ధూ, రూపీందర్ సింగ్ లు దాడి చేశారు. ఈ దాడిలో గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు.
అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గుర్నామ్ సింగ్ కుటుంబసభ్యులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 25న పిటిషన్ ను విచారించనుంది. దీంతో, సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది.