పాకిస్థాన్‌లో దారుణ ఘటన.. 18 ఏళ్ల హిందూ అమ్మాయి కాల్చివేత!
- దక్షిణ సింధ్ ప్రావిన్స్, రోహి పట్టణం, సుక్కూర్‌లో ఘటన
- పాక్‌లో హిందూ యువతులను అపహరిస్తోన్న దుండగులు
- బలవంతంగా ముస్లిం యువకులతో పెళ్లిళ్లు, మత మార్పిళ్ల ఘటనలు
పాకిస్థాన్ లో ఓ హిందూ అమ్మాయిని దుండగులు కాల్చి చంపారు. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో రోహి పట్టణం, సుక్కూర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పాక్‌లో హిందూ యువతులను అపహరించడం, ముస్లిం యువకులతో పెళ్లి చేయడం, అనంతరం మత మార్పిళ్లకు పాల్పడడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇందులో భాగంగానే 18 ఏళ్ల ఓ హిందూ అమ్మాయిని దుండగులు అపహరించడానికి ప్రయత్నించారు. ఆ యువతి ప్రతిఘటించడంతోనే ఆమెపై దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, 2013- 2019 మధ్య 156 బలవంతపు మతమార్పిళ్ల ఘటనలు చోటు చేసుకున్నాయని పీపుల్స్ కమిషన్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ఓ నివేదికలో పేర్కొంది.
కాగా, పాక్‌లో హిందువుల జనాభా 1.60 శాతంగా ఉండగా, వారి మొత్తం జనాభాలో సింధ్ ప్రాంతంలో అత్యధికంగా 6.51 శాతం మంది ఉన్నారు. వారికి మతవాదుల నుంచి తరుచూ వేధింపులు ఎదురవుతున్నాయి.