ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ముగిసేవ‌ర‌కు న‌లుగురు టీడీపీ సభ్యుల స‌స్పెన్ష‌న్

  • స‌భ‌లో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళ‌న
  • అశోక్‌, రామ‌రాజు, స‌త్య‌ప్ర‌సాద్, రామ‌కృష్ణ స‌స్పెన్ష‌న్
  • ఫైబ‌ర్ గ్రిడ్ ప్రాజెక్టుపై చ‌ర్చ‌
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నేడు కూడా గంద‌ర‌గోళం నెల‌కొంది. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో ఆ పార్టీకి చెందిన నలుగురు స‌భ్యుల‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేశారు. ఈ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డే వ‌ర‌కు (ఈ నెల 25 వ‌ర‌కు) వారిపై స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. స‌స్పెన్షన్ వేటు ప‌డిన వారిలో అశోక్‌, రామ‌రాజు, స‌త్య‌ప్ర‌సాద్, రామ‌కృష్ణ ఉన్నారు. 

కాగా, నేడు బడ్జెట్ కేటాయింపులపై నాలుగో రోజు చర్చ జరుగనుంది. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఉభయ సభల్లో స్వల్ప కాలిక చర్చ జ‌ర‌గాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఏపీ ఫైబ‌ర్ గ్రిడ్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీ ఫైబ‌ర్ గ్రిడ్ ప్రాజెక్టు పెద్ద కుంభ‌కోణ‌మ‌ని మ‌ద్దిశెట్టి వేణు గోపాల్ ఆరోపించారు. అర్హ‌త‌లేని కంపెనీల‌కు టెండ‌ర్లు క‌ట్ట‌బెట్టి భారీగా అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ్డార‌ని విమర్శించారు. 


More Telugu News