యస్తిక అర్ధ సెంచరీ.. బంగ్లాదేశ్ ఎదుట 230 పరుగుల లక్ష్యం
- భారీ స్కోర్లు సాధించడంలో విఫలమైన భారత బ్యాటర్లు
- మరోమారు అర్ధ సెంచరీ సాధించిన యస్తిక
- గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కెప్టెన్ మిథాలీ రాజ్
ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన (30), షెఫాలీ వర్మ (42) తొలి వికెట్‌కు 74 పరుగులు చేసి మంచి పునాది వేశారు. యస్తికా భాటియా మరోమారు అర్ధ సెంచరీ (50)తో అదరగొట్టింది. కెప్టెన్ మిథాలీ రాజ్ దారుణంగా విఫలమైంది. ఆడిన తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
రిచా ఘోష్, పూజావస్త్రాకర్ కాసేపు క్రీజులో కుదురుకున్నప్పటికీ భారీ స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు. రిచా 26, పూజ 30 పరుగులు చేశారు. ఫలితంగా 50 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 229 పరుగులు మాత్రమే చేసింది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు ఏమాత్రం నిలువరిస్తారన్న దానిపై భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే భారత్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. బంగ్లా బౌలర్లలో రితు మోని 3 వికెట్లు పడగొట్టగా, నహిదా అక్తర్ రెండు వికెట్లు తీసుకుంది.