తెలుగు సినిమాలో హీరోయిన్ గా ఉక్రెయిన్ భామ
- జాతిరత్నాలు చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్
- అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా చిత్రం
- హీరోయిన్ గా మరియా ర్యాబోషప్కా ఎంపిక
- సెట్స్ పైకి స్వాగతం పలికిన చిత్రబృందం
జాతిరత్నాలు చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ తదుపరి ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ చిత్రంలో తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తుండడం విశేషం. ఇది శివకార్తికేయన్ కు 20వ చిత్రం. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు.
కాగా ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ భామ మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సెట్స్ పై ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఉక్రెయిన్ కు చెందిన మరియా ర్యాబోషప్కా ఇటీవల ఓ ఇండియన్ వెబ్ సిరీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
.