త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ దూకుడు!.. 11వ స్థానం నుంచి 3వ స్థానానికి!

  • తెలంగాణ ప్ర‌స్తుత త‌ల‌స‌రి ఆదాయం రూ.2.78 ల‌క్ష‌లు
  • రాష్ట్ర ఆవిర్భావం సమ‌యంలో రూ.1.24 ల‌క్ష‌లు మాత్ర‌మే
  • జాతీయ త‌ల‌స‌రి ఆదాయం కంటే రెట్టింపన్న తెలంగాణ సీఎస్ 
అభివృద్ధిలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న కొత్త రాష్ట్రం తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయంలో మ‌రింత మేర మెరుగైన ఫ‌లితాల‌ను సాధిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ స‌మ‌యంలో రూ.1.24 ల‌క్ష‌ల త‌ల‌స‌రి ఆదాయం క‌లిగిన తెలంగాణ.. 2021-22 ఏడాదికి రూ.2.78 ల‌క్ష‌ల‌కు పెంచుకుంది. ఈ మేర‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ సోమ‌వారం నాడు ఆస‌క్తిక‌ర గ‌ణాంకాల‌ను వెల్ల‌డించారు. 

రాష్ట్ర ఆవిర్భావం స‌మ‌యంలో దేశంలో మెరుగైన త‌ల‌స‌రి ఆదాయం క‌లిగిన రాష్ట్రాల జాబితాలో 11వ స్థానంలో ఉండ‌గా.. ఇప్పుడు ఏకంగా 3వ స్థానానికి ఎగ‌బాకింద‌ని సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జాతీయ త‌ల‌స‌రి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం రెట్టింపైంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖకు చెందిన నేష‌న‌ల్ డిఫెన్స్ క‌ళాశాల‌ల బృందంతో స‌మావేశ‌మైన సందర్భంగా సోమేశ్ కుమార్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.


More Telugu News