తమిళనాడులో కొత్త పథకం.. యాక్సిడెంట్ బాధితులకు సాయం చేస్తే రివార్డు
- బాధితులకు ఇప్పటికే ఇన్నుయిర్ కాప్పోన్ పేరిట పథకం
- భారీ నెట్‌వర్క్‌తో ఆసుపత్రుల సేవలు
- దీనికి అదనంగా ఇప్పుడు సాయపడేవారికీ రివార్డుల ప్రకటన
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సదుపాయాలను అందించడంలో సహాయపడే వ్యక్తులకు నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలను అందించనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ వ్యవధిలో వైద్య సాయం అందేలా చేసిన వారికి ప్రశంసా పత్రం తోపాటు రూ.5 వేల నగదు పారితోషికం ఇస్తామని స్టాలిన్ ప్రకటించారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి 48 గంటల్లో ఉచిత వైద్యం అందించే 'ఇన్నుయిర్ కాప్పోన్' పథకాన్ని ముఖ్యమంత్రి గతంలోనే ప్రారంభించారు. తమిళనాడులో ఈ పథకం అమలు కోసం సుమారు 609 ఆసుపత్రులు, 408 ప్రైవేట్ ఆసుపత్రులు, 201 ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ఈ పథకం ద్వారా బాధితునికి గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు బీమాను అందజేస్తారు. తాజాగా ఈ పథకానికి అదనంగా ప్రమాద బాధితులకు సకాలంలో సాయం అందించే వ్యక్తులకు రివార్డులను ప్రకటిస్తూ తమిళనాడు సర్కారు నిర్ణయం తీసుకుంది.