అర్ధరాత్రి పరుగు వీరుడు ప్రదీప్ మెహ్రాపై ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యలు
- నోయిడా రోడ్లపై పరుగు
- దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రదీప్ మెహ్రా
- సైన్యంలో చేరడంపై మెహ్రా ఆసక్తి
- మెక్ డొనాల్డ్స్ లో విధులు ముగిసిన తర్వాత పరుగు
- ఓ వీడియో ద్వారా వెల్లడైన వైనం
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా అర్ధరాత్రి వేళ ఓ కుర్రాడు వీపుకు బ్యాగు తగలించుకుని పరిగెత్తుతున్న వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఆ కుర్రాడి పేరు ప్రదీప్ మెహ్రా కాగా, మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో పనిచేస్తున్నాడు. ఆర్మీలో చేరేందుకని ప్రతిరోజు విధులు ముగిసిన తర్వాత 10 కిమీ పరుగెత్తి తన నివాసానికి చేరుకుంటాడు. ఇప్పుడా కుర్రాడి కథ దేశం మొత్తం వ్యాపించింది.
దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆ కుర్రాడు ఎవరిపైనా ఆధారపడని వ్యక్తి అని, కారులో లిఫ్ట్ ఇస్తామన్నా వద్దన్న వైనం అతడి స్వభావాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. ఆత్మనిర్భరతకు సరైన నిదర్శనం అని కొనియాడారు. ఆ కుర్రాడి నుంచి తాను పొందిన స్ఫూర్తి ఇదేనని ఆనంద్ వివరించారు.
అటు, ప్రదీప్ మెహ్రా కథను తెలుసుకున్న విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ కోసం తగిన విధంగా తోడ్పాటు అందిస్తానన్నారు. దీనిపై ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ రానా కలితాతో మాట్లాడానని, ఈ కుర్రాడికి తప్పక సాయం అందుతుందని అన్నారు.