యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ కు చైనా సాయం
- యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్
- 10 మిలియన్ యువాన్ల ఆర్థిక సాయం ప్రకటించిన చైనా
- ఇంతకు ముందే 5 మిలియన్ యువాన్లను ప్రకటించిన వైనం
రష్యా చేస్తున్న యుద్ధంతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. భారీగా దెబ్బతిన్న ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించేందుకు చైనా ముందుకొచ్చింది. మానవతా సాయంగా 10 మిలియన్ యువాన్లు (దాదాపు రూ. 12 కోట్లు) ఇవ్వనున్నట్టు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 5 మిలియన్ యువాన్లను ఉక్రెయిన్ కు ఇస్తున్నట్టు ఈ నెల తొలి వారంలోనే చైనా ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన 10 మిలియన్ యువాన్లు దీనికి అదనం. అనేక దేశాలు ఉక్రెయిన్ కు తమవంతు సాయం అందిస్తున్నాయి. ఇండియా కూడా మందులు, ఆహారం, దుప్పట్లు పంపించింది.