పెగాసస్ పై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ అసెంబ్లీ
- పెగాసస్ పై హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయం
- టీడీపీ హయాంలో పెగాసస్ ను కొనుగోలు చేశారన్న మమతా బెనర్జీ
- పెగాసస్ ను కొనుగోలు చేయలేదని గతంలోనే చెప్పిన గౌతమ్ సవాంగ్
పెగాసస్ విషయంలో ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీలో పెగాసస్ అంశం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. టీడీపీ హయాంలో పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేశారంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పడం కలకలం రేపింది.
మరోవైపు గత టీడీపీ ప్రభుత్వం పెగాసస్ ను కొనుగోలు చేయలేదని గతంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. పెగాసస్ ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందా? అంటూ ఒక ఆర్టీఐ దరఖాస్తుదారుడు అడిగిన ప్రశ్నకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెగాసస్ పై హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయించడం గమనార్హం.