ఓ వ్యక్తి ప్రతిసారీ మా అన్నయ్యను టార్గెట్ చేసేందుకు ప్రయత్నించాడు: మంచు మనోజ్
- 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు విజయం
- 'మా' అధ్యక్షుడిగా ఎన్నిక
- శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవంలో మనోజ్ ప్రసంగం
- మా ఎన్నికల ప్రస్తావన
శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవంలో మోహన్ బాబు తనయుడు, నటుడు మంచు మనోజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మా' ఎన్నికల నేపథ్యంలో తన సోదరుడు మంచు విష్ణును ఓ వ్యక్తి ప్రతిసారీ టార్గెట్ చేశారని ఆరోపించారు. మానసికంగా ఇబ్బందిపెట్టాలని చూశాడని, ఆఖరికి 'మా' ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి తన వయసుతో సంబంధంలేకుండా నానా మాటలు అన్నాడని మంచు మనోజ్ తెలిపారు.
"ఈ విషయం మా నాన్నకు చెబితే, అతడికి జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు, అతడి మాటలు పట్టించుకోవద్దు వదిలేయ్ అన్నారు. అది నిజమే అనిపించింది. ఆ వ్యక్తి చుట్టూ ఎంతోమంది గొప్పవాళ్లు ఉన్నా, అతడు మాత్రం ఏ తపన లేకుండా జీవిస్తున్న విషయం అర్థమైంది. నాకు తెలిసినంత వరకు పరిశ్రమలో అందరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి ప్రవర్తన మాత్రం భిన్నంగా ఉన్నట్టు గుర్తించాం. జీవితంలో లక్ష్యం కంటే విలువలు గొప్పవి. మనిషి లోపలి నుంచి ఉద్భవించేవి ఆ విలువలు. అవి లేకపోతే మనిషి తనను తాను నాశనం చేసుకుంటాడు" అంటూ మంచు మనోజ్ ప్రసంగించారు.