పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేయడంలో తప్పేముంది?: మంత్రి బొత్స సత్యనారాయణ
- ఆస్తుల జప్తు ఇప్పుడు కొత్తగా రాలేదు
- గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు
- పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు బలోపేతం కాలేవన్న మంత్రి
ఆస్తి పన్నులు కట్టని వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆస్తిపన్ను కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చెత్త పన్ను కట్టలేదనే కారణంతో దుకాణాల ముందు చెత్త వేసిన ఘటన విమర్శల పాలయింది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ తీసేస్తామని చెప్పడంలో తప్పేముందని బొత్స ప్రశ్నించారు. ఆస్తుల జప్తు అనేది ఇప్పుడు కొత్తగా రాలేదని అన్నారు. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పడాన్ని తప్పు అంటే ఎలా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఈ విధానాన్ని ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. ఆస్తులు జప్తు చేయడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు బలోపేతం కాలేవని అన్నారు. పన్నులు కట్టకపోతే అధికారులు నోటీసులు ఇవ్వాలని... ఇంటికి తాళాలు వేయడం సరికాదని చెప్పారు.