సాహసంతో కూడిన ప్రయోగమే 'ఆర్ ఆర్ ఆర్'
- ప్రయోగాల బాటలో రాజమౌళి
- ఇంతవరకూ ఎన్టీఆర్ తో మూడు హిట్స్
- చరణ్ కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిన 'మగధీర'
- ముగ్గురి కాంబినేషన్లో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్'
- ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా రిలీజ్
ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ కి సంబంధించిన సందడే కనిపిస్తోంది. ఏ వేదికపై చూసినా రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ కనిపిస్తున్నారు. ఈ నెల 25 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇంతవరకూ రాజమౌళికి ఫ్లాప్ అంటే తెలియదు. ఆయన సినిమాలు ఒకదానికి మించి మరొకటి ఉంటాయనే నమ్మకం ఆడియన్స్ లో బలంగా ఉంది. అదే ఈ సినిమాకి రాజముద్రలా పనిచేయనుంది.
ఎన్టీఆర్ రెండో సినిమా అయిన 'స్టూడెంట్ నెంబర్ వన్' సినిమాతో రాజమౌళి కెరియర్ మొదలైంది. ఆ తరువాత ఆయన ఎన్టీఆర్ లోని మాస్ యాక్షన్ యాంగిల్ ని 'సింహాద్రి' సినిమాలో చూపించారు. ఫాంటసీ టచ్ ఇస్తూ, 'యమదొంగ' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. వరుసగా మూడు సినిమాలకు పనిచేయడం వలన ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ లో మాస్ యాక్షన్ పాళ్లు పుష్కలంగా ఉన్నాయని గ్రహించిన ఆయన 'ఆర్ ఆర్ ఆర్'లో కొమరం భీమ్ పాత్రను ఇచ్చారు.
ఇక చరణ్ సెకండ్ సినిమా చేసింది కూడా రాజమౌళినే. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మగధీర' సంచలన విజయాన్ని సాధించింది. రాజులు .. రాజరికాలు .. పునర్జన్మలను కలుపుతూ ఆయన చేసిన ఈ సినిమా చరణ్ కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. అందువల్లనే అల్లూరి సీతారామరాజు వంటి ధీరోదాత్తుడి పాత్రను ఆయన 'ఆర్ ఆర్ ఆర్'లో చరణ్ తో వేయించారు. పౌరాణికాలు బాగా తీయగలనని 'యమదొంగ'తోను .. జానపదాల తరహా కథలను అద్భుతంగా ఆవిష్కరించగలనని 'మగధీర'తోను నిరూపించిన రాజమౌళి, తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథను 'ఆర్ ఆర్ ఆర్' తో టచ్ చేశారు. నిజంగా ఇది సాహసంతో కూడిన ప్రయోగమే. ఈ సినిమా ఏ స్థాయి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి.