లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన ర్యాలీ
- కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం వల్ల ప్రజలు చనిపోతున్నారని ఆరోపణ
- జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం
- మద్య నిషేధంపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్న
టీడీపీ నేత నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శాసన సభా పక్షం నిరసనకు దిగింది. కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం వల్ల ప్రజలు చనిపోతున్నారంటూ సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిషేకం చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ శాసనసభ పక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. మద్య నిషేధంపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందంటూ విమర్శించారు. దాని వల్ల వందలాది మంది చనిపోతున్నారని ఆరోపించారు.
ఏపీలో కరోనా మరణాలతో పోటీగా కల్తీ సారా మరణాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంకెన్ని చావులు చూస్తారని రాసివున్న ప్లకార్డులు ప్రదర్శించారు. నాటుసారా, చీప్ లిక్కర్‌ను జగన్ రెడ్డి ప్రమోట్ చేస్తున్నారని చినరాజప్ప ఆరోపించారు. కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం మరణాలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో మార్పు లేదని చెప్పారు.