మరో దిగ్గజ సంస్థను సొంతం చేసుకున్న ముఖేశ్ అంబానీ

  • క్లోవియాలో 89 శాతం వాటాను సొంతం చేసుకున్న అంబానీ
  • ప్రీమియం లోదుస్తుల వ్యాపారంలో పేరెన్నికగన్న క్లోవియా 
  • అత్యుత్తమ ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమన్న ఈషా అంబానీ
ముఖేశ్ అంబానీ ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఏ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినా లాభాల్లోనే దూసుకుపోతుంది. తాజాగా మరో దిగ్గజ సంస్థను ముఖేశ్ అంబానీ టేకోవర్ చేశారు. ప్రముఖ ప్రీమియం లోదుస్తుల రిటైల్ సంస్థ క్లోవియాలో ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. 

క్లోవియా మాతృ సంస్థ పర్పుల్ పాండ్ ఫ్యాషన్స్ లో 89 శాతం వాటాను రూ. 950 కోట్లకు సొంతం చేసుకుంది. మిగిలిన 11 శాతం వాటా సదరు సంస్థ వ్యవస్థాపక సభ్యులు, మేనేజ్ మెంట్ దగ్గర ఉంది. ఇప్పటికే జివామే, అమాంట్ బ్రాండ్లు రిలయన్స్ చేతిలో ఉన్నాయి. తాజాగా క్లోవియాను సొంతం చేసుకోవడంతో ఇన్నర్ వేర్ సెగ్మెంట్ లో రిలయన్స్ వాటా మరింత పెరిగింది. ఈ సందర్భంగా ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈషా అంబానీ మాట్లాడుతూ, వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.


More Telugu News