సూట్‌కేసుల నిండా మిలియన్ డాలర్ల డబ్బు.. పారిపోయేందుకు యత్నించిన ఉక్రెయిన్ మాజీ ఎంపీ భార్య
- దొరికిపోయిన ఉక్రెయిన్ మాజీ ఎంపీ కోట్విట్స్కీ భార్య
- జకర్‌పట్టియా ప్రావిన్స్ మీదుగా హంగేరి చేరుకునే యత్నం
- సరిహద్దులో సూట్‌కేసులతో దొరికిన వైనం
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటున్న వేళ ఉక్రెయిన్ మాజీ ఎంపీ కోట్విట్స్కీ భార్య 28 మిలియన్ డాలర్లు, 1.3 మిలియన్ యూరోలున్న సూట్‌కేసులతో దేశం దాటేందుకు ప్రయత్నించారు. జకర్‌పట్టియా ప్రావిన్స్ మీదుగా హంగేరీకి చేరుకోవాలని ప్రయత్నించారు. అయితే, ఆమె ప్రయత్నం బెడిసికొట్టింది. హంగేరీ బోర్డర్ గార్డ్స్‌కు ఆమె దొరికిపోయారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా తన దాడిని మరింత ఉద్ధృతం చేస్తోంది. దాడి తీవ్రతను పెంచుతూ హైపర్ సోనిక్ క్షిపణులను కూడా ప్రయోగిస్తోంది. మరోవైపు, యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి 10 మిలియన్ల మంది వలస వెళ్లారు. వీరిలో 3.4 మిలియన్ల మంది పొరుగు దేశాలైన పోలాండ్, స్లోవేకియా, రొమేనియా, హంగేరీ వంటి దేశాలకు వెళ్లారు. ఇంకోవైపు, యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో వందలాది మంది పౌరులు మరణిస్తున్నారు. తాము ఇప్పటి వరకు 14 వేల మంది రష్యన్ సైనికులను హతమార్చినట్టు ఉక్రెయిన్ చెబుతోంది.