కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామం తగ్గించనున్న కేంద్రం
- ఇప్పటిదాకా కొవిషీల్డ్ డోసుల మధ్య 12-16 వారాల విరామం
- 8-16 వారాలకు తగ్గించాలని సిఫారసు
- కేంద్రానికి సూచించిన ఎన్టీఏజీఐ
- కొవాగ్జిన్ డోసుల విరామం యథాతథం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వి, కోర్బెవాక్స్ వంటి వ్యాక్సిన్లు ఇస్తుండడం తెలిసిందే. తాజాగా, కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామాన్ని తగ్గించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటిదాకా కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న వారు రెండో డోసు కోసం 12 నుంచి 16 వారాలు ఆగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడా నిడివిని 8 నుంచి 16 వారాలకు తగ్గించాలని ఎన్టీఏజీఐ (నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్) కేంద్రానికి సిఫారసు చేసింది.
అటు, కొవాగ్జిన్ రెండు డోసుల మధ్య 28 రోజుల విరామంలో ఎటువంటి మార్పులేదు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించాయి. దీన్ని భారత్ కు చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. కొవాగ్జిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా పరిశోధన సంస్థ అభివృద్ధి చేయడం తెలిసిందే.