ఏపీలో మరో 49 కరోనా పాజిటివ్ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 9,580 కరోనా పరీక్షలు
- అనంతపురం జిల్లాలో 19 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 56 మంది
- కరోనా మరణాలు నిల్
- ఇంకా 511 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 9,580 శాంపిల్స్ పరీక్షించగా, 49 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 56 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో మరణాలేవీ సంభవించలేదు.
ఏపీలో ఇప్పటివరకు 23,19,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,03,989 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 511 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.
ఏపీలో ఇప్పటివరకు 23,19,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,03,989 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 511 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.