గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన రామ్ గోపాల్ వర్మ
- మహిళా జర్నలిస్టు స్వప్నతో కలిసి మొక్కలు నాటిన వర్మ
- ఫొటోలు పంచుకున్న స్వప్న
- పచ్చదనం అంటే తనకు గిట్టదన్న వర్మ
- "నా అసంతృప్తి" అంటూ స్వప్నకు రిప్లయ్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగం పంచుకున్నారు. పాత్రికేయురాలు స్వప్నతో కలిసి మొక్కలు నాటారు. ఆ మొక్కలకు నీళ్లు కూడా పోశారు. ఆపై, తనదైనశైలిలో స్పందించారు. తనకు పచ్చదనం అంటే నచ్చదని, బురద అంటే అస్సలు గిట్టదని పేర్కొన్నారు. వర్మతో కలిసి మొక్కలు నాటిన ఫొటోలను స్వప్న ట్విట్టర్ లో పంచుకోగా, "నా అసంతృప్తి" అంటూ వర్మ బదులిచ్చారు. మొత్తానికి వర్మ కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాలుపంచుకున్నారు.
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ హరిత చాలెంజ్ నిర్విఘ్నంగా ముందుకుసాగుతోంది. కరోనా సంక్షోభ సమయంలోనూ సెలెబ్రిటీలు ఈ చాలెంజ్ పట్ల విశేషంగా స్పందించారు.
.
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ హరిత చాలెంజ్ నిర్విఘ్నంగా ముందుకుసాగుతోంది. కరోనా సంక్షోభ సమయంలోనూ సెలెబ్రిటీలు ఈ చాలెంజ్ పట్ల విశేషంగా స్పందించారు.