తన ఫేవరెట్ కెప్టెన్ ఎవరో చెప్పిన శ్రేయాస్ అయ్యర్
- కేఎల్ రాహుల్ నాకు ఇష్టమైన కెప్టెన్
- ఆటగాళ్లకు ఎంతో మద్దతుగా నిలుస్తాడు
- నిర్ణయాలను ప్రశాతంతతో తీసుకుంటాడు
- నాతో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయించింది అతడే
- మనసులోని మాట పంచుకున్న కేకేఆర్ కెప్టెన్
శ్రేయాస్ అయ్యర్ అన్ని ఫార్మాట్లలోనూ బంతితో ఆరివీర భయంకర ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. జట్టుకు నమ్మకమైన బ్యాట్స్ మ్యాన్ గా మారిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా పని చేసి వేలానికి వెళ్లిన అతడిని.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసి కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం అతడి సామర్థ్యానికి నిదర్శనం.
అయ్యర్ ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతుండగా.. గతంలో కోహ్లీ నాయకత్వంలోనూ పనిచేసిన అనుభవం ఉంది. అయినా కానీ, తనకు ఇష్టమైన కెప్టెన్ ఎవరని? అడిగితే కేఎల్ రాహుల్ పేరు చెప్పడం ఆసక్తికరం. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో కేఎల్ రాహుల్ సారథ్యంలో మూడు వన్డే మ్యాచ్ లను అయ్యర్ ఆడాడు. అప్పుడు అయ్యర్ బ్యాట్ తో పెద్దగా రాణించలేకపోయాడు.
కాకపోతే 2019 తర్వాత మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్ లో బౌలింగ్ వేసే అవకాశం అయ్యర్ కు రాహుల్ రూపంలో లభించింది. అంతకుముందు 2019లో వెస్టిండీస్ తో, 2017లో శ్రీలంకతో మ్యాచులలో అలా బౌలింగ్ వేసేందుకు అవకాశం చిక్కింది. దక్షిణాఫ్రికా సిరీస్ లో అయ్యర్ 3.1 ఓవర్లు బౌలింగ్ వేసి 22 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ, బౌలింగ్ అవకాశం ఇచ్చినందుకు రాహుల్ కు అయ్యర్ ధన్యవాదాలు చెప్పాడు.
రాహుల్ తనకు ఇష్టమైన కెప్టెన్ అని, అన్ని ఓవర్ల పాటు బౌలింగ్ వేసే అవకాశం మరే కెప్టెన్ కూడా తనకు ఇవ్వలేదని అయ్యర్ చెప్పాడు. ‘‘మొదట అతడు అసాధారణ ఆటగాడు. మైదానంలో, జట్టు సమావేశాల్లో అతడికి ఉండే నమ్మకం, ఆటగాళ్లకు అతడు ఇచ్చే మద్దతు గొప్పగా ఉంటుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసకుంటాడు. అతడి కింద ఆడడాన్ని ఎంతగానో ఆస్వాదించాను’’అని అయ్యర్ చెప్పాడు.