బస్సు కోసం ఎదురుచూస్తూ బస్టాప్ లో డ్యాన్స్ చేసిన వ్యక్తి.. నవ్వులు పంచుతూ అందరినీ కట్టిపడేసిన వీడియో ఇదిగో
- ఇంగ్లండ్ లోని లివర్ పూల్ లో ఘటన
- వీడియోను పోస్ట్ చేసిన మహిళ
- బాగా వైరల్ అయిపోయన వైనం
- నవ్వులు పంచేందుకేనని వెల్లడి
- ఆనందపడిన డ్యాన్స్ చేసిన వ్యక్తి
ఏదైనా ఊరికి వెళ్తున్నాం.. బస్సు కోసం బస్టాప్ కు వెళ్లాం.. ఎంత సేపు చూసినా బస్సు రాలేదు.. చిరాకు పుడుతుంది. సరేలే అని ఫోన్ లో పాటలు వింటూనో లేదా తిరుగుతూనో కాలక్షేపం చేస్తుంటాం. కానీ, బస్టాప్ లో అందరూ చూస్తుండగా డ్యాన్స్ చేశారా? లేదు కదూ! ఇంగ్లండ్ లోని లివర్ పూల్ సిటీలో ఇదే జరిగింది. బస్ ఎంతకీ రాకపోయే సరికి ఆ వ్యక్తి రోడ్డు మీద స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హుషారుగా కాలు కదిపాడు. ఆ డ్యాన్స్ మొత్తాన్ని రోడ్డుపక్క నుంచి ఓ మహిళ వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ డ్యాన్స్ వీడియో కాస్తా వైరల్ అయింది. అందరూ అతడి డ్యాన్స్ ను చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు.
‘గ్రేట్ హోమర్ స్ట్రీట్ టుడే. హేలీ లూయీ అనే మహిళ ఈ లివర్ పూల్ వీడియోను పోస్ట్ చేసింది’ అంటూ ఏంజీస్ లివర్ పూల్ అనే మహిళ వీడియోను పోస్ట్ చేసింది. ‘‘హా అవును.. నేనే ఆ వీడియో తీశాను. జస్ట్ జనం మొహాల్లో చిరునవ్వుల కోసమే ఆ వీడియో తీసి పోస్ట్ చేశాను. అది వైరల్ అయింది. ఆ వ్యక్తి మా జిమ్ కే వస్తాడు. ప్రపంచంలో ఎవరూ లేరన్నట్టుగా అతడు డ్యాన్స్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అది కనులవిందుగా అనిపించింది’’ అని హేలీ లూయీ రిప్లై ఇచ్చింది.
కాగా, ఆమెకు ఆ డ్యాన్స్ చేసిన వ్యక్తి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ డ్యాన్స్ చేసింది తానేనని ఓర్లాండో టిరెల్లి అనే వ్యక్తి రిప్లై ఇచ్చాడు. తన డ్యాన్స్ ను వీడియో తీస్తున్నారన్న సంగతే తనకు తెలియదని, ఎలాగైతేనేం తనను అంతలా వైరల్ చేసినందుకు ఆనందంగా ఉందని అన్నాడు. తన డ్యాన్స్ తో చాలా మంది మోముల్లో ఆనందం, నవ్వులు వెల్లివిరుస్తాయంటే అంతకన్నా కావాల్సిందేముంటుందని హర్షం వ్యక్తం చేశాడు.