‘బాహుబలి–2’లా ‘ది కశ్మీర్ ఫైల్స్’ ప్రభంజనం.. నిన్న ఒక్కరోజే రికార్డ్ స్థాయి వసూళ్లు
- నిన్న రూ.24.8 కోట్లు రాబట్టిన సినిమా
- సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లో రూ.141.25 కోట్ల వసూళ్లు
- రోజువారీ వసూళ్లలో నిన్నటి కలెక్షన్లే అత్యధికం
- ఇవాళ రూ.30 కోట్లు వసూలయ్యే చాన్స్ ఉందన్న తరణ్ ఆదర్శ్
చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా పెను సంచలనమే సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కొందరు తప్ప సినిమా చూసిన వాళ్లంతా బాగుందని కొనియాడుతున్నారు. కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలను సినిమాలో కళ్లకు కట్టారు. రెండు వారాలవుతున్నా సినిమా కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటిదాకా సినిమా రూ.141.25 కోట్ల వసూళ్లను రాబట్టింది. త్వరలోనే రూ.150 కోట్ల మార్క్ ను దాటేస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
కాగా, కశ్మీర్ ఫైల్స్ సినిమా కలెక్షన్ల వివరాలను ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్లకన్నా.. తొమ్మిదో రోజు వచ్చిన వసూళ్లే అత్యధికం అని ఆయన చెప్పారు. సినిమా వసూళ్లను చూస్తుంటే ఒకే ఒక్క–గుర్రం పందెంలో దూసుకెళ్తున్నట్టు అనిపిస్తోందని, రెండోవారాంతంలో బాహుబలి–2లా ప్రభంజనం సృష్టిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
10వ రోజైన ఇవాళ రూ.28 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టినా వసూళ్లు విపరీతంగా వస్తున్నాయన్నారు. రెండో వారంలోని శుక్రవారం రూ.19.15 కోట్లు, శనివారం రూ.24.8 కోట్లు వసూలయ్యాయని తెలిపారు. సినిమా రిలీజైనప్పటి నుంచి రోజువారీ వసూళ్లలో శనివారం వచ్చిన కలెక్షన్లే అత్యధికమన్నారు. సోమవారం నాటికి సినిమా వసూళ్లు రూ.175 కోట్ల మార్క్ ను తాకే అవకాశముందని అంచనా వేశారు.
కాగా, వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలకపాత్ర పోషించారు.