ఎన్నికలు వచ్చే నాటికి ఈ సినిమాను ప్రజలు మర్చిపోతారు: సంజయ్ రౌత్
- దేశ వ్యాప్తంగా ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఆదరణ
- కశ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదన్న రౌత్
- వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరికీ రాజకీయ ప్రయోజనం చేకూరదని వ్యాఖ్య
మొదట కేవలం 400 థియేటర్లలోనే విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇప్పుడు ఏకంగా 4,000 థియేటర్లలో ఆడుతూ రికార్డులను తిరగరాసే దిశగా వెళ్తున్న విషయం తెలిసిందే. కేవలం నోటి మాట ద్వారా ఈ సినిమాకు ఎనలేని పబ్లిసిటీ వస్తోంది. ఈ సినిమాపై వివాదాలు కూడా రాజుకుంటుండడంతో దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. కశ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.
‘ది కశ్మీర్ ఫైల్స్’ కేవలం సినిమా మాత్రమేనని అన్నారు. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరికీ రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని తాను అనుకోవట్లేదని తెలిపారు. ఎన్నికల నాటికి ఈ సినిమాను ప్రజలు మర్చిపోతారని చెప్పారు. కాగా, ఈ సినిమాపై కొందరు నేతలు ప్రశంసలు కురిపిస్తుండగా, ఇందులో అసత్యాలు చూపించారంటూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు.