హమ్మయ్య..! చైనా.. దక్షిణ కొరియాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
- దక్షిణ కొరియాలో సగానికి తగ్గుదల
- మూడు రోజుల క్రితం 6 లక్షలకు పైనే
- తాజాగా 3 లక్షలకు దిగొచ్చిన కేసులు
- చైనాలో స్వల్పంగా క్షీణత
కరోనా కొత్త కేసుల రాక చైనా, దక్షిణ కొరియాలో మొదటిసారి తగ్గుముఖం పట్టింది. దక్షిణ కొరియాలో స్వల్పంగా తగ్గగా.. చైనా సైతం ఆదివారం ప్రకటించిన కొత్త కేసుల గణంకాలు తగ్గుదలను చూపిస్తున్నాయి. ఏడాది తర్వాత చైనాలో తొలి కరోనా మరణం నమోదైంది.
దక్షిణ కొరియాలో గడిచిన 24 గంటల్లో 3,34,708 కొత్త కేసులు వచ్చినట్టు, 327 మంది మరణించినట్టు ఆదివారం ప్రకటించారు. అంతకుముందు రోజు 381,454 కేసులు వచ్చాయి. అంతకు రెండు రోజుల ముందు 6 లక్షలకు పైనే కొత్త కేసులు రావడం గమనించాలి. గత గురువారం 6,21,281 కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచి చూస్తే సగానికి కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒమిక్రాన్ వేరియంట్ లో కేసులు చాలా వేగంగా పెరిగి, వేగంగా తగ్గడాన్ని చూస్తూనే ఉన్నాం.
చైనాలో ఆదివారం 1737 కొత్త కేసులు వచ్చాయి. శనివారం వచ్చిన 2,228 కొత్త కేసులతో పోలిస్తే తగ్గాయి. వీటిల్లో 1,656 కేసులు స్థానికంగా వ్యాప్తి వల్ల వచ్చినవి. అసింప్టోమాటిక్ కేసులను కరోనా కేసులుగా చైనా ప్రకటించదు. అటువంటి కేసులు 2,316 నమోదయ్యాయి.