రూ.150 కోట్ల వసూళ్లకు చేరువలో ‘ది కశ్మీర్ ఫైల్స్’.. కొనసాగుతున్న దూకుడు
- 1990లో కశ్మీర్ వలసల ఆధారంగా తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’
- విడుదలైన వారంలోనే రూ. 100 కోట్ల వసూళ్లు
- 9వ రోజుకు రూ. 140 కోట్లకు చేరుకున్న కలెక్షన్లు
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ దూకుడు కొనసాగుతోంది. వసూళ్లలో దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు రూ. 140.95 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా రూ. 150 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. మార్చి 11న విడుదలైన ఈ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టింది.
9వ రోజున రూ. 24.50 కోట్లు సాధించింది. ఫలితంగా ఇప్పటి వరకు ఈ సినిమా సాధించిన వసూళ్లు రూ. 140.95 కోట్లకు చేరుకున్నాయి. ఈ వారంలోనే ఇది రూ. 150 కోట్ల మార్కును దాటుతుందని చెబుతున్నారు. 1990లో కశ్మీర్ తిరుగుబాటు సమయంలో కశ్మీరీ హిందువుల వలసల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అనుపమ్‌ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు.