రష్యాపై పోరాటానికి 98 ఏళ్ల వృద్ధురాలి సంసిద్ధత... వయసు రీత్యా వద్దన్న ఉక్రెయిన్ ప్రభుత్వం

  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • ఉక్రెయిన్ పౌరుల్లో పెల్లుబికిన దేశభక్తి
  • మాతృభూమి రక్షణకు ముందుకొచ్చిన పౌరులు
  • రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఓల్హా
రష్యా సైనికచర్యకు దిగిన నేపథ్యంలో ఉక్రెయిన్ పౌరుల్లో దేశభక్తి ఉప్పొంగుతోంది. వారు వీరు అని తేడా లేకుండా, వివిధ రంగాలకు చెందిన సాధారణ పౌరులు సైతం తుపాకులు చేతబట్టి కదనరంగంలోకి ఉరుకుతున్నారు. వారిలో వృద్ధులు, మహిళలు, నటులు, క్రీడాకారులు ఉన్నారు. కాగా, రష్యాపై పోరాడేందుకు 98 ఏళ్ల వృద్ధురాలు ఓల్హా త్వెర్డోఖిల్బోవా సంసిద్ధత వ్యక్తం చేశారు.

ఓల్హా మాజీ సైనికురాలు. రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న వీరమహిళ. రష్యా సేనలు ఉక్రెయిన్ లో ప్రవేశించిన నేపథ్యంలో, వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఓల్హా కూడా రగిలిపోయారు. అయితే, 98 ఏళ్ల వయసులో ఆమె యుద్ధరంగానికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని ఉక్రెయిన్ ప్రభుత్వం భావించింది. యుద్ధరంగంలో అమెకు ఎంతో అనుభవం ఉన్నా ఆమె విజ్ఞప్తిని నిరాకరించింది. అయితే,  ఆమె ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని కీవ్ లో తాము విజయోత్సవాలు జరుపుకోవడం ఖాయం అని పేర్కొంది


More Telugu News