కరోనా ఫోర్త్ వేవ్ పై ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్న భారత్ బయోటెక్ అధినేత

  • పలు దేశాల్లో మళ్లీ కరోనా ఉద్ధృతి
  • మన దగ్గర ఏమంత ప్రభావం చూపదని వెల్లడి
  • ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని వ్యాఖ్యలు
  • మూడో డోసు తీసుకోవడం కూడా మంచిదేనని వివరణ
పలు దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ లోనూ ఫోర్త్ వేవ్ తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై కొవాగ్జిన్ సృష్టికర్త, భారత్ బయోటెక్ అధినేత కృష్ణా ఎల్లా స్పందించారు. భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ పై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. దేశమంతా దాదాపుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిందని, కరోనా ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు ప్రజలు పూర్తి సన్నద్ధతతో ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ కృష్ణా ఎల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. 

కరోనా ఫోర్త్ వేవ్ ఏమంత ప్రభావం చూపుతుందని అనుకోవడంలేదని వెల్లడించారు. ఇక కరోనా బూస్టర్ డోసు తీసుకుంటే ఇంకెలాంటి భయం అక్కర్లేదన్నారు. అయితే, కరోనా మార్గదర్శకాలు ఇప్పటికీ పాటించాల్సిందేనని, మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతికదూరం తప్పనిసరి అని స్పష్టం చేశారు.


More Telugu News