తొలి అడుగులోనే కొలువుల జాత‌ర‌కు శ్రీకారం చుట్టిన పంజాబ్ సీఎం

  • తొలి కేబినెట్‌లోనే మాన్ కీల‌క నిర్ణ‌యం
  • 25 వేల ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తి
  • 10 వేల ఉద్యోగాల‌తో పాటు ఇత‌ర శాఖ‌ల్లో 15 వేల పోస్టుల భ‌ర్తీ
పంజాబ్ నూత‌న సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన ఆప్ నేత భ‌గ‌వంత్ మాన్ స‌రికొత్త నిర్ణ‌యాల‌తో దూసుకెళుతున్నారు. సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన మూడు రోజుల‌కే త‌న కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న మాన్‌.. ఆ వెంట‌నే నేడు తొలి కేబినెట్ భేటీని కూడా నిర్వ‌హించారు. ఈ తొలి కేబినెట్‌ సమావేశంలోనే నిరుద్యోగుల్లో స‌రికొత్త ఉత్సాహం నింపేలా కొలువుల జాత‌ర‌ను ప్ర‌క‌టించారు. 

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి మాన్ మంత్రివ‌ర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ ఉద్యోగాల్లో 10 వేల పోస్టులు పోలీసు శాఖ‌కు చెందిన‌వి కాగా.. మిగిలిన 15 వేల పోస్టులు వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు చెందిన‌వి. మాన్ త‌న తొలి కేబినెట్ భేటీలోనే 25 వేల ఉద్యోగాల భ‌ర్తీకి నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల పంజాబ్ నిరుద్యోగుల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


More Telugu News