జై షాకే మళ్లీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ పగ్గాలు
- 2021లో కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జైషా
- తిరిగి మరో మారు జై షాకే బాధ్యతలు
- ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిల్
బీసీసీఐ కార్యదర్శి జై షా మరోమారు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆయన వరుసగా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ పదవికి 2021లో జై షా ఎన్నికయిన సంగతి తెలిసిందే.
తాజాగా శనివారం నాడు కౌన్సిల్ ప్రెసిడెంట్ పదవి కోసం కౌన్సిల్ భేటీ జరగగా మరోమారు ఈ పదవికి జై షానే ఎన్నికయ్యారు. కౌన్సిల్ సభ్యులు జై షాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కౌన్సిల్ కాసేపటి క్రితం ప్రకటించింది. మొత్తం 25 దేశాల బోర్డుల సభ్యత్వం కలిగిన కౌన్సిల్ దుబాయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ కౌన్సిల్‌కు చైర్మన్‌గా భారత్‌కే చెందిన అమితాబ్ చౌదరి కొనసాగుతున్నారు.