జగన్ గారూ... నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా?: లోకేశ్
- జంగారెడ్డిగూడెం మరణాలపై రాజకీయ రగడ
- వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
- సీఎం జగన్ ను ఉద్దేశించి లోకేశ్ ట్వీట్
- పులివెందులలో సారా బట్టీలు బయటపడ్డాయని వెల్లడి
జంగారెడ్డిగూడెం మరణాల వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. అవి నాటుసారా మరణాలేనని టీడీపీ అంటుండగా, సహజ మరణాలని సీఎం జగన్ సహా వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. "జగన్ గారూ... నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా?... అబద్ధాలే శ్వాసగా బతికేస్తున్నారు" అంటూ విమర్శించారు.
"జంగారెడ్డిగూడెం వంటి పట్టణంలో నాటుసారా కాస్తారా? అని అమాయకంగా అడిగారు. ఇదిగో మీ ఊళ్లో నాటు సారా బట్టీ. ఇప్పుడు మీ సొంత ఊరు పులివెందులలోనే నాటు సారా బట్టీలు బయటపడ్డాయి. దీనికి ఏం సమాధానం చెబుతారు?" అంటూ లోకేశ్ నిలదీశారు. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 2021 జనవరి నుంచి ఇప్పటిదాకా 300 కేసులు నమోదయ్యాయి. "స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సారా ఏరులై పారుతోంది. ఇక రాష్ట్రంలో సారా మరణాలకు అంతులేదు" అని పేర్కొన్నారు.