మహిళల ప్రపంచకప్: టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించిన ఆస్ట్రేలియా
- నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో మిథాలీ సేన
- వరుస విజయాలతో జోరుమీదున్న ఆసీస్
- టాప్-4లో నిలవాలంటే భారత్‌కు విజయం తప్పనిసరి
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. టాప్-4లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం మిథాలీ సేనకు తప్పనిసరి. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడి నాలుగు పాయింట్లతో జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.
మరోవైపు, ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిన మిథాలీ సేన ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా తిరిగి గాడిలో పడాలని పట్టుదలతో ఉంది. భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. దీప్తి శర్మ స్థానంలో షెఫాలీవర్మ జట్టులోకి వచ్చింది.