అది మ‌న సంస్కృతి కాదు.. చిన‌జీయ‌ర్ వివాదంపై జేపీ వ్యాఖ్య‌

  • దేవుళ్ల‌పై వ్యాఖ్య‌లు స‌రికాదు
  • ఆహార‌పు అల‌వాట్ల‌ను ప్ర‌శ్నించ‌రాదు
  • స‌మాజాన్ని క‌లిపి ఉంచేందుకే కృషి చేయాలి
  • వీడియో సందేశంలో జేపీ సూచన‌
మేడారంలో వెల‌సిన స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ చిన‌జీయ‌ర్ స్వామిపై రేగిన వివాదం దాదాపుగా ముగిసింద‌నే చెప్పాలి. శుక్రవారం నాడు ప్ర‌త్యేకంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన చిన‌జీయ‌ర్‌.. త‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని, త‌న వ్యాఖ్య‌ల‌కు ముందు, వెనుక ఉన్న విష‌యాన్ని తీసేసి దుష్ప్ర‌చారం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్టేనన్న వాద‌న వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. చిన‌జీయ‌ర్ వ్యాఖ్య‌లు, వాటిపై రేగిన వివాదంపై లోక్ స‌త్తా వ్య‌వ‌స్థాప‌కుడు డాక్ట‌ర్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా మీ దేవుళ్ళు తక్కువ.. మా దేవుళ్ళు ఎక్కువ అనే రీతిలో మాట్లాడ‌టం భారతీయ సంస్కృతి కాదని జేపీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా స‌మాజంలో ఒక్కొక్క‌రికి ఒక్కో ర‌కమైన ఆహార అల‌వాట్లు ఉంటాయ‌ని, వాటిని కూడా ప్ర‌స్తావించడం, విమ‌ర్శించ‌డం స‌రికాద‌ని సూచించారు. స‌మాజాన్ని క‌లిపి ఉంచేలా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు హేతుబ‌ద్ధ వివ‌ర‌ణ‌ల‌తోనే దానిని స‌ద్దుమ‌ణిగేలా చేయాల‌ని ఆయ‌న సూచించారు.


More Telugu News