20 రోజుల తర్వాత స్వదేశానికి నవీన్ మృతదేహం
- మార్చి 1న ఖర్కివ్‌లో మృతి చెందిన నవీన్
- అప్పటి నుంచి మృతదేహం కోసం ఎదురుచూపులు
- ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు చేరనున్న మృతదేహం
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో మృతి చెందిన భారతీయ విద్యార్థి నవీన్ మృతదేహం 20 రోజుల తర్వాత ఆదివారం బెంగళూరుకు చేరుకోనుంది. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉక్రెయిన్ నగరం ఖర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువుతున్న నవీన్ మార్చి 1న రష్యా సంధించిన షెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. నవీన్ కుటుంబ సభ్యులు అతడి డెడ్ బాడీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు నవీన్ తండ్రి, కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో నవీన్ మృతదేహం తరలింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.