రామ్ చరణ్ మంచి మనసు... ఉక్రెయిన్ లో తనకు బాడీగార్డుగా వ్యవహరించిన వ్యక్తికి ఆర్థికసాయం

  • ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు
  • దారుణంగా మారిన పౌర జీవనం
  • ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకున్న ఆర్ఆర్ఆర్
  • కీవ్ లో చరణ్ కు బాడీగార్డుగా వ్యవహరించిన రస్టీ
  • రస్టీకి ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్న చరణ్
ఉక్రెయిన్ ప్రస్తుతం రష్యా దాడులతో తల్లడిల్లిపోతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తన మంచి మనసు చాటుకున్నారు. రస్టీ అనే ఉక్రెయిన్ వ్యక్తికి డబ్బు పంపించి మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోనూ షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రామ్ చరణ్ కు రస్టీ బాడీగార్డుగా వ్యవహరించాడు. 

రష్యా సైనికచర్యతో ఉక్రెయిన్ లో పౌర జీవనం దారుణంగా మారిందన్న వార్తలతో రామ్ చరణ్ ఆందోళన చెందారు. వెంటనే రస్టీతో ఫోన్ లో మాట్లాడి, వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రస్టీ తండ్రి 80 ఏళ్ల వయసులోనూ తుపాకీ పట్టి దేశం కోసం పోరాడుతున్న తీరు పట్ల చలించిపోయారు. రస్టీకి ఆర్థికసాయం చేయగా, ఆ డబ్బుతో అత్యవసర ఔషధాలు కొనుక్కున్నట్టు రస్టీ ఓ వీడియోలో వెల్లడించాడు. రామ్ చరణ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.


More Telugu News