ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటన
- పాత షెడ్యూళ్లను మార్చిన ప్రభుత్వం
- పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు సమావేశం
- కొత్త షెడ్యూళ్లకు రూపకల్పన
- ఏప్రిల్ 27 నుంచి పదో తరగతి పరీక్షలు
- మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ప్రకటించింది. పదో తరగతి పాత షెడ్యూల్ ను మార్చుతూ, కొత్త తేదీలు నేడు వెల్లడించింది. తాజా షెడ్యూల్ ప్రకారం... ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు సమావేశం అనంతరం కొత్త షెడ్యూళ్లకు రూపకల్పన చేశారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్...
ఏప్రిల్ 27- తెలుగు
ఏప్రిల్ 28- సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29- ఇంగ్లీష్
మే 2- మ్యాథ్స్
మే 4- సైన్స్ పేపర్ 1
మే 5- సైన్స్ పేపర్ 2
మే 6- సోషల్ స్టడీస్
అటు, ఇంటర్ పరీక్షలకు కూడా కొత్త షెడ్యూల్ ప్రకటించారు. మే 6 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్...
ఏప్రిల్ 27- తెలుగు
ఏప్రిల్ 28- సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29- ఇంగ్లీష్
మే 2- మ్యాథ్స్
మే 4- సైన్స్ పేపర్ 1
మే 5- సైన్స్ పేపర్ 2
మే 6- సోషల్ స్టడీస్
అటు, ఇంటర్ పరీక్షలకు కూడా కొత్త షెడ్యూల్ ప్రకటించారు. మే 6 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.