ఏపీలోనూ ఉద్యోగాల భర్తీ.. గ్రూప్ 1, 2 లకు సీఎం గ్రీన్ సిగ్నల్
- జాబ్ క్యాలెండర్ పోస్టుల కంటే అధికంగా భర్తీకి అనుమతి
- అదనంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీ
- గ్రూప్ 1లో 110 పోస్టుల భర్తీ
- గ్రూప్ 2లో 182 పోస్టుల భర్తీకి అనుమతి
తెలంగాణలో 80వేలకు పైగా కొత్తగా ఉద్యోగాల భర్తీకి ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్వయంగా కేసీఆరే ఈ మేరకు సభలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ కొత్తగా ఉద్యోగాల భర్తీకి అక్కడి జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ మేరకు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే కూడా అధిక సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి జగన్ అనుమతి ఇచ్చారు. త్వరలో చేపట్టనున్న ఈ ఉద్యోగాల భర్తీలో భాగంగా గ్రూప్ 1 కింద 110 పోస్టులను, గ్రూప్ 2 కింద 182 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కానున్నట్లు సమాచారం.